ఏఐసిసి అధ్యక్షులు ఎంమల్లికార్జున ఖర్గే పిలుపుమేరకు,మహబూబాబాద్ నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని,నేడు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19&20 వ తేదీన జరిగే కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దళిత గిరిజన రిజర్వేషన్లు దళిత గిరిజన డిక్లరేషన్ గురించి సుదీర్ఘంగా చర్చించనున్నట్లు గా తెలిపారు..అలాగే తాజా రాజకీయ పరిస్థితుల గురించి కలసి చర్చించడానికి ఢిల్లీకి వెళ్లనున్నామని.ఈ నెల 21 లేదా 22వ తేదీ నుండి నియోజకవర్గం లో అందుబాటులో ఉంటామని కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గమనించాలని చూచించారు.
ఢీల్లి వెళ్ళనున్న మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్....అందుకోసమేనా.?
August 17, 2023
0
Tags
