◆రెండున్నర లక్షల విలువైన నల్ల బెల్లం పట్టివేత.
◆35 క్వింటాల నల్ల బెల్లం, క్వింటాల్ పటిక.
◆అశోక్ లైలాండ్ వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు.
◆ఇద్ధరి అరెస్టు...ఒకరు పరారీ.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకోలేరని కురివి ఎస్ఐ గోపి హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2.5 లక్షల విలువైన నల్ల బెల్లం,పటికను పట్టుకుని ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకుని పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో తన సిబ్బందితో కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా తెల్లవారుజామున సుమారు 5 గంటల 30 నిమిషాల సమయంలో అనుమానాస్పదంగా అశోక్ లైలాండ్ వాహనం రావటం జరిగిందని వెంటనే పోలీస్ లు ఆపుటకు ప్రయత్నించగా వారిని చూసి వాహనం నుండి దిగి ఒకరు పారిపోగా, ఇద్ధరిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మరిపెడ మండలం బీచురాజుపల్లి శివారు జర్పుల తండాకు చెందిన జర్పుల సురేష్, కురవి మండలం సూధనపల్లి గ్రామ శివారు మాలోత్ తండా కు చెందిన మాలోత్ రమేష్ లు ముఠాగా ఏర్పడి నల్లబెల్లం వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని కొన్ని రోజులుగా బెల్లం తీసుకొనివచ్చి అమ్మి అధిక మొత్తంలో అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. అదే క్రమంలో ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ ప్రాంతం నుండి 70 బస్తాల నల్లబెల్లం, క్వింటా పటిక కొనుగోలు చేసి కాకినాడకు చెందిన గుబ్బుల కృష్ణార్జునుడు (కృష్ణ) ఆటో డ్రైవర్ అశోక్ లైలాండ్ వాహనంలో కురవి వైపుకు వస్తుండగా కురవి పోలీసులు పట్టుకొని 35 క్వింటాల నల్లబెల్లం, క్వింటా పట్టిక తో సహా అశోక్ లైలాండ్ వాహనాన్ని సీజ్ చేసి, ఇద్ధరిని జర్పుల సురేష్ , ఆటో డ్రైవర్ గుబ్బుల కృష్ణార్జునుడు లను అదుపులో తీసుకొని కేసు నమోదు
చేసినట్లు ఎస్సై గోపి తెలిపారు. మాలోత్ తండా కు చెందిన మాలోత్ రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు సీజ్ చేసిన నల్లబెల్లం, పట్టిక విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 2.50 లక్షలు ఉంటుందన్నారు.
చేసినట్లు ఎస్సై గోపి తెలిపారు. మాలోత్ తండా కు చెందిన మాలోత్ రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు సీజ్ చేసిన నల్లబెల్లం, పట్టిక విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 2.50 లక్షలు ఉంటుందన్నారు.
