పడమటిగూడెంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
August 15, 2023
0
సమాజంలో స్వేచ్ఛ,సమానత్వం,సౌబ్రాతుత్వం పెంపొందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని , స్వాతంత్ర్యపు ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలని సర్పంచ్ జొన్న గడ్డల యాదలక్ష్మి వెంకన్న అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పంచాయతీ కార్యదర్శి గన్న ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ ,వెంకటేశ్వర్లు ,ఎంపిటిసి పాతూరి మధు రెడ్డి, ఉప సర్పంచ్ కుంభాల నర్సమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిమ్ముల వెంకటరెడ్డి,మాజీ సర్పంచ్ హెచ్చు వెంకన్న బిఆర్ఎస్ యూత్ వింగ్ మండల ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం, యువజన కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి చిర్ర సతీష్ గౌడ్, నాయకులు దారం వేదయ్య,కుంబాల శ్రీశైలం, పాతూరి వెంకట్ రెడ్డి,సైదులు వార్డు సభ్యులు అనంతరెడ్డి, అలువాల యాకన్న ,భద్రు అంగన్వాడి సిబ్బంది, పంచాయతీ సిబ్బంది దేవేందర్,భాద వెంకన్న,హెచ్చు వెంకన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

