Type Here to Get Search Results !

మహా యోధుల త్యాగాల నుండీ స్ఫూర్తి పొందినప్పుడే బాధ్యత యుతమైన భారతీయ సమాజ నిర్మాణం సాధ్యం-కల్నల్ శ్రీనివాస్.



వీరోచితమైన నాటి స్వాతంత్ర్య పోరాట ఘట్టాలు,మహా యోధుల త్యాగాల నుండీ స్ఫూర్తి పొందినప్పుడే బాధ్యత యుతమైన భారతీయ సమాజం నిర్మాణంఅవుతుందని డా"కల్నల్ శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తోర్రూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న  100 అడుగుల జాతీయ  జెండా వేదిక ఆవరణలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అమరుల త్యాగాలు మారువొద్దని నిరంతరం జరిగిన పోరాటాల ఫలితమే నేటి స్వతంత్ర్యమని మొదటి రెండు తరాలు స్వతంత్ర్యం అనంతరం బాధ్యత యుతంగా జీవించారనీ ,మూడో తరమైన నేటి విద్యార్థి లోకం ఈ ప్రేరణ నిరంతరం కొనసాగించాలిసిన బాధ్యత అందరి పై ఉందన్నారు.వీరోచిత మైన నాటి గట్టాలు మహా యెదుల త్యాగాల నుండీ స్ఫూర్తి పొందినప్పుడే బాధ్యత యూత మైన భారతీయ సమాజం నిర్మాణం అవుతుందన్నారు. 100 అడుగుల  జాతీయ పతాక వేదిక ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్   డా"పోనుగోటి సోమేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య ,తొర్రూర్ డిఎస్పి  వెంకటేశ్వర బాబు, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు తక్కలపల్లి రవీందర్ రావు,సిఐ సత్యనారాయణ,ఎస్సై జగదీష్, మున్సిపల్ కమిషనర్ సరస్వతి, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగసురేందర్ రెడ్డి, హై స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం బీవీ రావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, 100 అడుగుల  జాతీయ జెండా ప్రతిష్టాపన కమిటీ సభ్యులు శామకూరి ఐలయ్య, కుర్ర శ్రీనివాస్ ,బిజ్జాల అనిల్, ధరావత్ జై సింగ్,దొంగరి శంకర్, చీకటి శ్రీనివాస్,నాయకులు గుండాల నరసయ్య,ప్రభాకర్, సురేందర్, సురేష్, పుర ప్రముఖులు, సైనిక అగ్నివీర్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.