ఆత్మహత్య చేసుకున్న రాజ్ కుమార్ మృతి వారి కుటుంబానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజక వర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మృతుని స్వగ్రామమైన బొత్తల తండా (అమ్మాపూరం) కు చేరుకుని విద్యార్థి రాజ్ కుమార్ పార్థీవ దేహం పై పూలమాలవేసి నివాళులు అర్పించి 10వేల రూ.ల తక్షణ ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ ఈ ఆత్మహత్య కు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని రాజ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని,మృతుడి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అలాగే 25 లక్షల నష్ట పరిహారం తక్షణమే ఆ కుటుంబానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మృతుని కుటుంబానికి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

