ఇస్లావత్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని బిచ్చ తండాలో ఘనంగా తీజ్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువతీ యువకులు ఆటపాటలతో నృత్యాలతో ర్యాలీగా బయలుదేరి స్థానిక పెద్ద చెరువులో గోధుమ నారు బుట్టలను నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోడా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ లంబాడి గిరిజనులకు పవిత్రమైన పండుగ అని, తీజ్ పండుగ ఐక్యతకు ప్రత్యేకత గా నిలుస్తుందని సోదరీ సోదరీమణుల, అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనం తీజ్ పండుగ అని సర్పంచ్ అన్నారు.ప్రతి ఒక్కరూ గిరిజనుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దలు పాల్గొన్నారు.
