Type Here to Get Search Results !

ఈ నిందితులను గుర్తించండి...కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి.

ఖమ్మం, కొత్తగూడెం మరియు సరిహద్దు జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసుశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాల్లోని వైరా, తల్లాడ, కొణిజర్ల మరియు ఏనుకూరు మండల పరిధిలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులకు సంబందించిన ఇద్దరు ముద్దాయిలు మొహాలకు మాస్కులు కట్టుకొని నెంబర్ ప్లేట్ లేని తెలుపు రంగు పల్సర్ ఎన్.ఎస్.-200 మోడల్ బైక్ మీద తిరుగుతూ స్నాచింగులకు పాల్పడుతున్నారు.ఫోటోలలో వారిని గుర్తించిన వారు కానీ,ఈ విధమైనా వేశాధారణ ఉన్నవారు తెలుపు కలర్ పల్సర్ బండి తో కనిపిస్తే వెంటనే డయల్ 100 కాల్ చేసి  పోలీసు వారికీ సమాచారం అందించి దొంగలను పట్టుకునేందుకు సహకరించాలని ఖమ్మం జిల్లా పోలీస్ లు
విజ్ఞప్తిచేశారు..డయల్  100 తో పాటు ఈ క్రింది నంబర్స్ కూడా సంప్రదించగలరు.ఏసిపి. వైరా 8712659146,సిఐ ,వైరా 8712659147, ఎస్సై తల్లాడ 8712659154,ఎస్సై వైరా మపి.ఎస్. 8712659148, ఎస్సై కొనిజెర్ల పి.ఎస్.8712659150,ఎస్సై ఎనుకూరు 8712659178 తదితరులకు సమాచారాన్ని అందించాలని ,సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని ,ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.