18 సంవత్సరాల కొత్త ఓటర్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.
గురువారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో 18 సంవత్సరంల ఓటర్ల ను గుర్తించేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈనెల 19వ తేదీన 5 కే రన్ చేపడుతున్నందున ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు
18 సంవత్సరముల యువ ఓటర్లను గుర్తించేందుకు వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు కళాశాలల్లోనూ వసతి గృహాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఫారం- 6 లను ఇచ్చి సమగ్ర వివరాలను సేకరించాలన్నారు.
విద్యాసంస్థలన్నిటికీ సమాచారం ఇవ్వాలని సమగ్ర నివేదికలు అందించాలన్నారు ఆగస్టు 21 సోమవారం నాడు ఓటర్ల జాబితా ముసాయిదా ను పబ్లిష్ చేస్తామన్నారు. 50 మంది కంటే అధికంగా ఉంటే ఆయా ప్రాంతంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.
ఆర్డీవోలు నియోజకవర్గం ఓటర్ల జాబితా వివరాల నివేదిక తీసుకోవాలన్నారు.
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.
ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఇతర పోలింగ్ కేంద్రాలకు మార్చుకునేందుకు ఫారం 8 ద్వారా అందజేయాలన్నారు. క్రీడల్లో గుర్తింపు పొందినవారిని బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోవాలనిచెప్పారు.
స్వీప్ నోడల్ అదికారులు కార్యక్ర మానాలను ముమ్మరంచేసి 18 సంవత్సరముల ఓటర్లను అధిక సంఖ్యలో గుర్తించాలన్నారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ గిరిజన సంక్షేమ అధికారి ఎర్రయ్య బీసీ సంక్షేమ అధికారి నరసింహ స్వామి షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి స్వీప్ ప్రజలు పాల్గొన్నారు నోడల్ అధికారి సన్యాసయ్యా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
