మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ...
నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి భాదితులకు న్యాయం చేకూర్చే విధంగా పోలీసు అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.గంజాయి రవాణా,మట్కా,బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవస్తీకృత నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముందస్తుగా వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.షీ టీమ్స్ ఆవశ్యకత గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేసారు.స్థానికంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండాలని,ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జో చెన్నయ్య, తొర్రూరు డిఎస్పీ వెంకటేశ్వర బాబు, సీసీఎస్ డిఎస్పీ మోహన్, జిల్లాలోని సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గోన్నారు.
