Type Here to Get Search Results !

లాటరీ విధానంతో విజయవంతంగా ఎక్సైజ్ షాప్ ల కేటాయింపు జిల్లా కలెక్టర్ శశాంక

నమస్తే మానుకోట




జిల్లాలో 59 మద్యం షాప్ లకు గాను ఏబీ ఫంక్షన్ హాల్ లో లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించి కేటాయింపులు జరిపారు. 

ముందుగా షాపుల వారీగా దరఖాస్తులు పరిశీలిస్తూ ఎక్సైజ్ శాఖ వారి పద్దతిలో ప్రత్యక్షంగా దరఖాస్తు దారుల ఎదురుగానే లాటరీ విధానంలో ఎంపిక చేసి ప్రకటించారు. ఈ విధంగా 1 నుండి క్రమ పద్ధతిలో 59 షాపులకు లాటరీ ద్వారా దరఖాస్తు దారులను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకులు కిరణ్ కుమార్, డి.ఎస్.పి.సత్యనారాయణ, పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.