ఈ సందర్భంగా బయ్యారం మండలంలోని మిర్యాలపెంట బోటితండా కు చెందిన బానోత్ రాందాస్ తన కుమారునికి 5వ తరగతి గురుకుల సొసైటీ నందు బ్యాక్ లాగ్ సీటు ఇప్పించాలని కోరారు.
డోర్నకల్ మండలం మండలం గొల్ల చర్ల గ్రామ శివారు సర్వేనెంబర్ 352/బి కబరస్తాన్ కు చెందిన ఒక ఎకరం భూమిని భూమిని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని విచారించి తగు న్యాయం చేయగలరని కోరారు.
పట్టణానికి చెందిన సర్వేనెంబర్ 253 లో గల 6.29 గుంటల భూమి తమ తాత ముత్తాతల, తల్లితండ్రులకు ఇనాం క్రింద ఇచ్చిన భూమి అని మేమె ఖాస్తు చేసున్నందున వారసులుగా తమ పేరుపై పట్టా చేసి ఇవ్వగలరని కోరారు.
కేసముద్రం మండలం అర్పణ పల్లి నుండి రాజంపల్లి గల మెటల్ రోడ్డు పై గల భూమిని ఆక్రమించి బిల్డింగ్ లు నిర్మించుకునున్నారని ప్రభుత్వ భూమిని కాపాడి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ లు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జి. శ్రావణ్ కోరారు.
కేసముద్రం మండలం గాంధీ నగర్ కు చెందిన బానోత్ మోహన్ తన భూమిని సర్వే చేసి పోడు హక్కు పత్రం ఇప్పించగలరని కోరారు.
అధికారులు, మండలాలలో తహసీల్దార్ లు రూల్ ప్రకారం పరిష్కారం చేసే దరఖాస్తులను పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో (88) దరఖాస్తులను వివిధ శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ గ్రీవెన్స్ లో జెడ్పీ సీ.ఈ.ఓ రమాదేవి, డిఆర్డీఏ పి.డి సన్యాసయ్య జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
