◆డోర్నకల్ లో కాషాయ జెండా ఎగరవేస్తాం.
◆డోర్నకల్ నియోజకవర్గ బిజెపి నాయకులు బానోత్ ప్రభాస్ నాయక్.
రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని నియోజకవర్గ పరిశీలకుడు, ఒరిస్సా బిజెపి ఎమ్మెల్యే భూదాన్ ముర్ము ఆశాభవం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం డోర్నకల్ నియోజకవర్గ నాయకులు భానోత్ ప్రభాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవినీతిలేని సుస్థిర పాలన అందిస్తామని వారు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం మండలంలోని పెద్దముప్పారం "అమ్మఒడి అనాధ ఆశ్రమంలో" వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ ఆదేశానుసారం డోర్నకల్ నియోజకవర్గంలోని ఊరూరా తన పర్యటన వారం రోజుల పాటు కొనసాగుతుందన్నారు. బీజేపీ శ్రేణులు పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి పని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, డోర్నకల్ అసెంబ్లీ కన్వీనర్ పూర్ణచందర్ రెడ్డి, గిరిజన మోర్చా నాయకురాలు దేవిక నాయక్, నర్సింహులపేట జడ్పిటిసి సంగీత, భాజపా నాయకులు బుల్లెట్ కృష్ణ, ప్రభాస్, మండల ప్రధాన కార్యదర్శి దుండి మురళి, అల్లం సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
