నర్సింహులపేట మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై గండ్రాతి సతీష్ హాజరై సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపుమండి కత్తి పట్టిన వీరుడతను దళిత, బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు సర్దార్ సర్వాయి పాపన్న అని,
పాపన్న చత్రపతి శివాజీకి సమకాలికుడని, శివాజీ ముస్లిం పాలకుల అంతానికి మహారాష్ట్ర లో ఎలాగైతే పోరాడాడో , పాపన్న కూడా తెలంగాణాలో ముస్లిం పాలన అంతానికి పోరాడాడని, అప్పటి మొగుల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడని, శత్రు దుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనమని, సర్వాయి పేట కోటతో మొదలు పెట్టి దాదాపు 20 కోటలను తన ఆదినంలో తెచ్చుకున్నాడని తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న మొగల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదురించి పాపన్న తన సైన్యంతో వెళ్లి దాడి చేసి దోచుకోవడం అలా దోచుకున్న సొత్తును అవసరమున్న చోట పేదప్రజలకు పంచి పెడుతూనే తమ సైన్యానికి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని తమ బహుజన సైన్యానికి ఆయుధాల శిక్షణ ఇప్పించారు
రాజ కుటుంబంలో పుట్టక పోయినా రాజనీతి ప్రదర్శిస్తూ పేదోళ్ళకు రాజయ్యాడు అరాచక శక్తులకు సింహ స్వప్నం అయి
ఒక్కో మెట్టు ఎక్కుతూ 12 మంది స్నేహితులతో మొదలు పెట్టిన గెరిల్లా సైన్యం 12 వెయ్యిల సైనుకులను సమకూర్చుకుని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీన పరుచుకొని 7 నెలలు అధికారం చెలాయించిన మహా వీరుడు పాపన్న అని, ఒక బహుజన కులస్తుడు రాజుగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక ఎదిరించి పోరాడలేక దొరలు, జమిందారులు మొగల్ పాలకుల దగ్గర జీ హుజూర్ వెన్ను పోటు పొడిచారని, ఓ వీరుని శకం ముగిసిందని ఎంతో మంది బలహీన వర్గాల యువతకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు పాపన్న అని, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహానుభావుల జీవితాలు మనకు ఆదర్శం అనడంలో ఎలాంటి ఎలాంటి సందేహం లేదు భావితరాలకు పోరాట స్ఫూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘనకీర్తిని సొంతం చెబుతున్నాయి కాని విచిత్రం ఏమిటంటే అదే చరిత్ర పుటల్లో ఇంకొంతమంది అమరవీరుల త్యాగాలకు సముచిత స్థానం దక్కక పోవడం అలాంటి వారిలో ప్రథముడే సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు పాపన్న చరిత్రను నేటి తరానికి అందించిన మాజి డీజీపీ పేర్వారం రాములు కు ఈ తరం రుణపడి ఉంటుందని అన్నారు
