Type Here to Get Search Results !

అసంపూర్తి టాయిలెట్ లతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు-పి.డి.ఎస్.యు.

మహబూబాబాద్ జిల్లా మరియు మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ కంబాలపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో గత రెండు సంవత్సరాల నుండి అసంపూర్తిగా నిర్మాణం చేసిఉన్న టాయిలెట్స్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పిడిఎస్యు మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి మధు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా అసంపూర్తిగా నిర్మాణం చేపట్టిన టాయిలెట్స్ ను పూర్తి చేయకుండా గ్రామ సర్పంచ్ మరియు కాంట్రాక్టర్ కుమ్మక్కై డబ్బులు దండుకొని వదిలేశారని తక్షణమే టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు వాడుకలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక సర్పంచ్ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి సర్పంచ్ మరియు కాంట్రాక్టర్ ఇద్దరు కుమ్మక్కై విద్యార్థుల గోసపంచుకుంటున్నారన్నారు. టాయిలెట్స్ కోసం బయటికి వెళ్తే ఇరుగుపొరుగు వారు తిడుతున్నారని విద్యార్థులు వాపోయారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం వర్కర్ల జీతాలు రాక విద్యార్థులకు సరైనటువంటి పోషకాహారం కూడా అందడం లేదని అన్నారు .తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, టాయిలెట్స్ ,మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనకు పిలిపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మండల అధ్యక్ష కార్యదర్శులు గుగులోతు విజయ్,నిమ్మల నేస్మా ,
మండల నాయకులు బాలకృష్ణ ,ప్రవళిక, చింటూ, శిరీష వినయ్ తదితరులు పాల్గొన్నారు.
  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.