మహబూబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురo గ్రామంలో పురాతన గుడి శుభ్రపరుస్తున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది.అట్టి విగ్రహాన్ని గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి పున ప్రతిష్టించారు. ఈనెల 19న శనివారం రోజున వట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చేయుటకు నిర్ణయించారు. కావున గ్రామ ప్రజలు మరియు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. గ్రామ పెద్దలు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, కంకటి ఉప్పలయ్య, గ్రామ సర్పంచ్ తులసి రామ్ నాయక్, గ్రామస్తులు బీరవెల్లి వేణుగోపాల్ రెడ్డి ,ఆగారెడ్డి, రాములు గ్రామస్తులు ముత్యం సుధాకర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ కోలా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
