రాబోయే రోజుల్లో కిసాన్ పరివార్ సేవలు ప్రతి ఇంటికి చేరేందుకు కృషి చేస్తున్నామని కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సింహులపేట కిసాన్ పరివార్ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యువతకు కిసాన్ పరివార్ టీషర్టులను పంపిణీ చేసి ,ఎయిర్ బెలూన్ లను ఎగురవేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భూపాల్ నాయక్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో యువతకు బంగారు భవిష్యత్తు కలుగుతుందని , నేడు నియోజకవర్గంలో యువత ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారని కిసాన్ పరివార్ సారధ్యంలో యువతను అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు తన వంతుగా కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మహేష్ శివకృష్ణ, వినయ్ ,యశ్వంత్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ పరివార్ సేవలు ప్రతీ ఇంటికి చేరేలా కృషి -ననావత్ భూపాల్ నాయక్.
August 23, 2023
0
Tags
