సోమవారం ఐడిఓసి లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మండల మున్సిపల్ గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీలలో మొక్కల పెరుగుదల ఉండాలని ప్లాంటేషన్లో లక్ష్యాలను సాధించేందుకు మొక్కలు నాటేందుకు గుంతలు తీయించడం వంటి పనులు త్వరితగతిన చేపట్టాలన్నారు.
వైకుంఠధామాలు సెగ్రి గేషన్ షడ్స్ నిర్వహణ గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు వంటి కార్యక్రమాలను పటిష్టంగా అమలుపరచాలన్నారు.
దూరంగా ఉన్న వైకుంఠధామాలకు మిషన్ భగీరథ కనెక్షన్లు తీసుకోవాలని వీలుకాని పక్షంలో సోలార్ సిస్టం ద్వారా ఏర్పాట్లు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని విధులలో నిర్లక్ష్యం వాటిస్తే సహించబోమని తెలియచెప్పారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఏ పిడి సన్యాసయ్య డిపిఓ నర్మద ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీవోలు ఈజీఎస్ పిఓలు తదితరులు పాల్గొన్నారు.
