శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరముల యువత ఓటు హక్కు పొందేందుకు గాను వారిలో స్ఫూర్తిని నింపేందుకు చేపట్టిన 5కే రన్ ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తో కలిసి కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
ఓటు హక్కు ఆయుధమని, ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి, యువకులు ఓటును నమోదు చేసుకొని ఓటు హక్కు నమోదు శాతాన్ని పెంచాలన్నారు.
ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకునేందుకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వృధా కారాదన్నారు.
ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకునేందుకే ఈ ఫైవ్ కే రన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని, మన స్వాతంత్య్ర సమరయోధులు ప్రజాస్వామ్యం ద్వారా మనకు ఇచ్చిన గొప్ప అవకాశం ఓటు హక్కు అని దానిని ఉపయోగించి దేశ భవిష్యత్తును మనమే నిర్మించుకోవచ్చని అన్నారు.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే సామాజిక బాధ్యతగా మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే నిర్ణేతలుగా మనము ఓటును నమోదు చేసుకోవడం విలువలతో కూడిన ఓటును వినియోగించుకోవడం మన అందరి మీద ఉన్న బాధ్యత అని అన్నారు.
5కె.రన్ లో యువతతో పాటు పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమ రోజువారి రన్ తో శారీరక శ్రమతో ఫిట్ గా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
ఓట్ ఫర్ స్యూర్ అనే నినాదంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 5కె రన్..లో యువత ఉత్సాహంగా పాల్గొనడం విశేషం అన్నారు
ఓట్ ఫర్ ష్యుర్ అనే నినాదంతో 5కె. రన్ లో పాల్గొన్న యువతను ఉద్దేశించి ఎస్.పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉన్నందున 18 సంవత్సరాల వయసు కలిగిన యువత ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన 5 కె.రన్ ఇందిరా గాంధీ స్టాచ్యూ నుండి బస్టాండ్ మీదుగా నర్సంపేట బైపాస్ నుండి వ్యవసాయ మార్కెట్ జంక్షన్ వద్దకు అక్కడి నుండి జూనియర్ కళాశాల వద్దకు కొనసాగింది.ఇందులో పాల్గొన్న యువతకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 10వేలు,6 వేలు,4 వేలుగా బాలుర, బాలికల విభాగాల నుండి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాల వయసు నిండిన యువతకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు ఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి సత్యనారాయణ ఆర్డిఓ అలివేలు మున్సిపల్ కమిషనర్ కే ప్రసన్న రాణి జిల్లా అధికారులు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
