ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు ఆలీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు.కురవి పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో లియాకత్ అలీ 19వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులం అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న అధ్యక్షత వహించగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా నిస్వార్ధంగా పోరాటాలు నిర్వహించిన లియాకత్ అలీ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్ ,గ్రామ కార్యదర్శి తురక రమేష్ ,కన్నె వెంకన్న, బుడమ వెంకన్న ,దూది కట్ల సారయ్య, అప్పల వెంకన్న, పోలెపాక వెంకన్న, కలగూర నాగరాజు, నిలుగొండ నాగేశ్వరరావు బూర్గుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


