తిరుమలాయపాలెం,జులై 18 (నమస్తే న్యూస్ ) తిరుమలాయపాలెం మండలం బంధంపల్లి రెవిన్యూ గ్రామంలో బంధం దగ్గర ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న ప్రజా అవసరాల కోసం ఎన్నోసార్లు విజ్ఞప్తి మేరకు మంజూరై నిర్మిస్తున్నది పనులను సిపిఎం మండల ప్రతినిధి బృందం పనులను పరిశీలించి వివరాల అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ గతంలో వర్షాలు వస్తే ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులు పడేవారని ప్రజల పట్ల వారి యొక్క సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు అధికారులకు మంత్రులకు సిపిఎం ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది ప్రజలకు రాకపోకలకు శాశ్వత పరిష్కారం లభించిందని వెంటనే పనులను పూర్తి చేసి ప్రజల అందుబాటులో తేవాలని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు కోడి లింగయ్య కొత్తపల్లి దామోదర్ రెడ్డి కొలిచాలం స్వామి తుళ్లూరు నాగేశ్వరావు పద్మనాభల సుధాకర్ రావు బింగి రమేష్ గోపోజి రవి చాగంటి శ్రీను రామకృష్ణ సత్యం తదితరులు పాల్గొన్నారు.

