నాగలి పట్టి ఆరక దున్నిన ఇల్లెందు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య..
పంట పొలాల్లో పెసర గింజలు చల్లిన ఎమ్మెల్యే.. కోరం
పొలంలో ట్రాక్టర్ తోనూ భూమిని సదును చేసిన ఎమ్మెల్యే.
రిపోర్టర్: పిల్లల, మల్లికార్జున్
సెంటర్: బయ్యారం.
మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 22(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండా గ్రామపంచాయతీలో నాగలి పట్టుకొని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆరక దున్నినారు.వాణిజ్య పంటల వేసుకోవాలని వ్యవసాయ శాఖ ఆధికారులు ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లును పొలంలో అవిష్కరించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ…రైతు సంప్రదాయ పద్దతి వేషదరణ లోపంట మార్పిడి చేసుకోవాలని,ఎల్ నినొఓ దృష్టిలో పెట్టుకొని వాణిజ్య పంటలు వైపు మొగ్గు చూపాలి రైతులు తెలియజేశారు.వర్షాలు పడడం కష్టం గా వుంది . వాటర్ నిల్వలేదు వరి పంటలు వేయవద్దు.వాణిజ్య పంటలు వైపు రైతులు దృష్టి పెట్టాలి అన్నారు,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశాల మేరకు రైతులు వాణిజ్య పంటలు వేసుకోవాలి అని ఎమ్మెల్యే అన్నారు… ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


