రామన్నపేట సెప్టెంబర్ 19(నమస్తే న్యూస్)
రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం రోజు ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశం (పేరెంట్ టీచర్ మీటింగ్) కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని అన్నారు. పిల్లల చదువు, క్రమశిక్షణపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ వహించాలని కోరారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, గ్రామంలోని ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చూసేందుకు గ్రామ పంచాయతీ తరపున పూర్తి సహకారం అందిస్తానని సర్పంచ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్.ఎమ్ శ్రీలత మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు పాఠశాలలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికలను ప్రోగ్రెస్ కార్డ్స్ తల్లిదండ్రులకు చూపించి, వారి చదువుపై చర్చించారు.ఈ కార్యక్రమంలో 5వ వార్డు మెంబర్ నేరటి మానస సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, అంగన్వాడి టీచర్ బత్తుల వసంత ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

