రూ.1.29 లక్షల విలువైన చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ
పుస్తకాల బాధ్యత కూడా నాదే : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
హైదరాబాద్ ,సెప్టెంబర్ 19 (నమస్తే న్యూస్):
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య విద్యను అభ్యసించి భవిష్యత్తులో వైద్యురాలిగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వరంగల్ జిల్లా చెన్నారెడ్డిపల్లి లేబర్ కాలనీకి చెందిన విద్యార్థిని వడ్డేపల్లి రహేల్, వడ్డేపల్లి ఎల్లస్వామి కుమార్తెకు TPCC SC డిపార్ట్మెంట్ అండగా నిలిచింది.
రహేల్ ప్రస్తుతం MBBS విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో ఆమె విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, TPCC SC డిపార్ట్మెంట్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ రూ.1,29,500 ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు రూ.1,29,500 విలువైన చెక్కును విద్యార్థిని రహేల్కు అందజేశారు.ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నారు. ముఖ్యంగా వైద్య విద్య వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన సమయంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పేర్కొన్నారు.
రహేల్ తన MBBS విద్యను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసి మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె విద్యకు తన వంతు సహాయం కొనసాగిస్తానని, పూర్తి చదువుకు అవసరమైన పుస్తకాల బాధ్యతను కూడా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.విద్యార్థిని భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయంతో పాటు పుస్తకాల బాధ్యతను కూడా స్వీకరించిన డా. కవ్వంపల్లి సత్యనారాయణకు రహేల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ ఎస్సీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ, ఉక్కుల అశోక్ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యను కొనసాగించేందుకు అవసరమైన సహకారం అందించడం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఉదారతకు నిదర్శనమన్నారు . రహేల్ వంటి విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేలా సమాజంలోని అన్ని వర్గాలు ప్రోత్సహించాలని కోరారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి పేదలకు సేవ చేసే స్థాయికి రహేల్ ఎదగాలని ఆకాంక్షించారు.



