సొంత ఖర్చులతో సేవా కార్యక్రమం చేపట్టిన ఉప సర్పంచ్ మాగి బాలకృష్ణ
300 మందికిపైగా భక్తులకు అన్నప్రసాదం
కార్యక్రమాన్ని ప్రారంభించిన రామసహాయం నరేష్‌రెడ్డి
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,సెప్టెంబర్ 19 (నమస్తే న్యూస్
భక్తి భావంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంతో హస్నాబాద్ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్‌లో, ఉప సర్పంచ్ మాగి బాలకృష్ణ తన సొంత ఖర్చులతో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 300 మందికిపైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామసహాయం నరేష్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహిస్తూ భక్తులకు సేవ చేయడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదాన్ని భక్తులకు క్రమబద్ధంగా వడ్డించడంతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గ్రామస్తులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో హస్నాబాద్.గ్రామ సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంగబత్తుల సుమన్‌రెడ్డి, సుబ్లేడు ఉపసర్పంచ్ భూక్య ఖనిల్, బండారు పాపిరెడ్డి, బండారి సత్తిరెడ్డి, తండా అంజయ్య, పంచాయతీ కార్యదర్శి నర్మద, కొత్త వెంకన్న (పాల), వార్డు సభ్యులు పల్లి గోపి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాతిక ఉపేందర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాతిక లింగయ్య, మాగి బాబు, మాగి లక్ష్మణ్, మాగి మధు, మాగి సాయి, మాజీ వార్డు సభ్యులు అనంతుల ఉప్పమ్మ, రామసాని పార్వతి తదితరులు పాల్గొన్నారు.

