
మరిపెడ,జులై 17(నమస్తే న్యూస్)గాలివారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని టీలావత్ తండాలో సుదీర్ఘ కాలంగా తండా వాసులు ఎదురు చూస్తున్న సిసి రోడ్డు పనులను అధికారికంగా ప్రారంభించారు.గ్రామ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభిం చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బల్లెం ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి, ఎల్లబోయిన సోమయ్య,వార్డ్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో తండావాసులు పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,పంచాయతీలోని ప్రతి తండా,ప్రతి వీధి అభివృద్ధి చెందాలన్నదే మా లక్షంగా పెట్టుకున్నామని,రోడ్లు,తాగునీరు,వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. టీలావత్ తండా ప్రజలు చాలా కాలంగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రహించి,ఈరోజు తండాలో రోడ్డుకు శంకుస్థాపన చేసినామని అన్నారు. నేడు ప్రారంభమైన ఈ సిసి రోడ్డుతో వారి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. పంచాయితీ అభివృద్ధికి ప్రజల సహాకారం ఎంతో అవసరమని,ప్రజల సహాకారం ఉంటే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుచుకుంటామని అన్నారు. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, అభివృద్ధికి వేసిన తొలి అడుగు అని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో గాలివారి గూడెం పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం తీసుకొని పని చేస్తామని స్పష్టం చేశారు. ఎన్.ఆర్.ఈ.జిఎస్ నిధులు 5 లక్షలతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యదర్శి మరియు వార్డ్ సభ్యులు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు పనులు ప్రారంభం కావడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. తండా వాసులు సర్పంచ్ మరియు పంచాయతీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
8
