
సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్.
డోర్నకల్/మరిపెడ(జులై 17)నమస్తే న్యూస్.
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని,ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని సిపిఐ(ఎం)మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ, మరిపెడ మండలంలో మొదటి విడతలో 655 ఇండ్లు మంజూరయ్యాయని,వాటిలో 242 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు.మిగిలిన ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే పూర్తయిన 242 ఇండ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని,ఎలాంటి పెండింగ్ ఉంచొద్దని కోరారు.అబ్బాయిపాలెం గ్రామంలో 120 మంది ఇల్లు లేని నిరుపేదలు ఇండ్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారని,వాటిలో మొదటి విడతలో 32 ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు.వాటిలో ఒకటి,రెండు మినహా మిగిలినవన్నీ నిర్మాణంలో ఉన్నాయని,వాటిలో సగం ఇండ్లు పూర్తయ్యాయని వివరించారు.
ఎల్3,ఎల్2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారుల ఇండ్లను అధికారులు పరిశీలించి వారందరికీ పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, లేదా వారికి కొత్త ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ గ్రామంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని,ఉపాధి హామీ పథకంలో ఇంటి నిర్మాణానికి 12 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం)వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ, వెంకన్న, నాయకులు లచ్చయ్య,కామిడ్ల వెంకన్న,జినక సైదులు తదితరులు పాల్గొన్నారు.
