నేరాల నియంత్రణకే ప్రాధాన్యత-భద్రతా ప్రమాణాలపై క్షుణ్ణ పరిశీలన.
మరిపెడ ఎస్ఐలు గుండ్రాతి సతీష్, ప్రభాకర్ రెడ్డి.

మరిపెడ,జూలై 17( నమస్తే న్యూస్).ప్రజల ఆస్తుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరిపెడ పోలీసులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయంగా కొనసాగుతున్నాయి.ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న మరిపెడ పోలీసులు శుక్రవారం పట్టణంలోని బంగారు రుణ ఆర్థిక సంస్థలు,పాన్ డబ్బాలు,దుకాణాలు,నగల దుకాణాల్లో ఆకస్మికంగా భద్రతా తనిఖీలు నిర్వహించారు.మరిపెడ ఎస్సైలు గండ్రాతి సతీష్,ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముతూట్, ఐఐఎఫ్ఎల్, కీర్తన,శ్రీరామ్ ఆర్థిక సంస్థల శాఖ కార్యాలయాలతో పాటు పాన్ దుకాణాలు,నగల దుకాణాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెచ్చరిక వ్యవస్థ,రికార్డింగ్ కెమెరాల పనితీరు,పరిధి,భద్రతా ప్రమాణాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల నిర్వాహకులతో సమావేశమై బంగారు రుణం మంజూరు చేసే సమయంలో రుణం తీసుకునే వారి పూర్తి వివరాలు,గుర్తింపు పత్రాలు,సమర్పించిన బంగారం యాజమాన్యాన్ని పూర్తిగా నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు బంగారు రుణం కోసం వచ్చినా లేదా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఆదేశించారు.ప్రజల భద్రతకు భంగం కలిగించే ఘటనలను ముందుగానే అరికట్టే లక్ష్యంతో మరిపెడ పోలీసులు చేపడుతున్న ఇలాంటి తనిఖీలు ప్రజల్లో భరోసా కల్పిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.వ్యాపార సంస్థలు కూడా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, రికార్డింగ్ కెమెరా వ్యవస్థలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలని, శాపుల యాజమాన్యాలకు సూచించారు.
