
తొర్రూర్, జూలై17,(నమస్తే న్యూస్)
తొర్రూర్ సమీకృత సంక్షేమ వసతి గృహానికి చెందిన ముగ్గురు చిన్నారి బాలురు రోడ్లపై దిక్కుతోచని స్థితిలో తిరుగుతుండగా, వారిని గుర్తించి సురక్షితంగా హాస్టల్కు చేర్చిన తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గద్ధల పరుశురాం సేవాభావం స్థానికంగా ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సమీకృత సంక్షేమ వసతి గృహంలో నివసిస్తున్న తూర్పటి గణేష్ (6వ తరగతి), గంధం అమర్ (7వ తరగతి), జలగం శివ (8వ తరగతి)లు స్కూల్కు వెళ్తున్నామని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు.అనంతరం పట్టణంలోని రోడ్లపై దిక్కుతోచని స్థితిలో తిరుగుతుండగా, ప్రజల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే గద్ధల పరుశురాం వారిని గమనించారు.వెంటనే స్పందించిన ఆయన బాలురను చేరదీసి వారి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులకు ధైర్యం చెప్పి, ఎలాంటి ప్రమాదం జరగకుండా స్వయంగా తన ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకుని సమీకృత సంక్షేమ వసతి గృహానికి సురక్షితంగా తీసుకెళ్లారు. అనంతరం హాస్టల్ యాజమాన్యానికి బాలురను అప్పగించి బాధ్యతాయుతంగా వ్యవహరించారు.ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రజా సేవా దృక్పథానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారని అన్నారు. చిన్నారుల భద్రత విషయంలో అప్రమత్తంగా స్పందించి వారిని సురక్షితంగా హాస్టల్కు చేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు.గద్ధల పరుశురాం చూపిన చొరవను హాస్టల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు ప్రశంసిస్తూ, సేవా స్ఫూర్తితో చేసిన ఈ చర్య ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
7
