
తిరుమలాయపాలెం,జూలై 17 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం గ్రామ సమీపంలో గల బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద మరమ్మత్తు నిమిత్తం ఆగి ఉన్న ఒక లారీని ఓ ద్విచక్రవాహనదారుడు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరిపెడ బంగ్లా నుంచి ఖమ్మం వైపు బండిపై బయలుదేరిన శ్రీసిటీ, ఖమ్మం రూరల్‌కు చెందిన జోగా సతీష్ (33, తండ్రి పేరు కోటేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి) రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి హెచ్చరిక సంకేతాలు, జాగ్రత్తలు పాటించకుండా రోడ్డుపై లారీని నిలిపిన డ్రైవర్‌పై మృతుడి తండ్రి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమలయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
.

6వివివీబీ
