
తొర్రూరు,జూలై 16 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రావుల జైదీప్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టైలు, బెల్టులు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ నలుగురి రామలింగం మాట్లాడుతూ..పుట్టినరోజులను ఆడంబరంగా జరుపుకోవడం కంటే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా యువతలో సేవాభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.విద్యార్థులకు అవసరమైన టైలు, బెల్టులను అందజేసిన రావుల జైదీప్ను గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అభినందించారు. విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుషా ఉపేందర్ రెడ్డి,పాపిరెడ్డి, అనిల్ రెడ్డి,సోమిరెడ్డి, అజిత్ రెడ్డి,మోహన్ రెడ్డి, రామ్మూర్తి,సోమలింగం, వెంకన్న,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

