వి.బి.జి రాంజీ పథకం రద్దు చేయాలి.
ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి.
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్.
కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.
డోర్నకల్/మరిపెడ(జూలై 01)నమస్తే న్యూస్.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)తొలగించి,దాని స్థానంలో వి.బి.జి రాంజీ పథకాన్ని తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లంపేట,బోటియ తండా,సోమ్లా తండా,ఆనేపురం,చిల్లంచర్ల,గుండెపూడి,తానంచర్ల,బునాహంపురం,అబ్బాయిపాలెం,పి.ఎస్ గూడెం,బాల్య ధర్మారం,అమృ నాయక్ తండా,గాలి వారి గూడెం,మరిపెడ తదితర గ్రామాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య,నాయకులు గుండగాని మధుసూదన్ మాట్లాడుతూ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని విమర్శించారు.నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడమేనని ఆరోపించారు.ఈ నిర్ణయం వల్ల దేశంలోని దాదాపు 40 కోట్ల మంది గ్రామీణ పేదలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.2006లో ఈ చట్టం ఏర్పడ్డాక గ్రామీణ పేదలకు సమానంగా పని దొరికిందని,మొదట పార్లమెంటులో బడ్జెట్‌లో 2.30 లక్షల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.కానీ 2026-27 బడ్జెట్‌లో కేవలం 87 వేల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే,చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నంలో కేంద్రం ఉందని స్పష్టమవుతోందన్నారు.ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని,లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మిక,కర్షక పోరాటాలు తప్పవని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో మండల ఆర్గనైజర్ బాణాల రాజన్న,మండల కమిటీ సభ్యులు జిన్నా లచ్చన్న,బోడుపట్ల రాజశేఖర్,కొండ ఉప్పలయ్య,ఎస్.కె.షరీఫ్,బయ్య సురేష్,నలబోడు లక్ష్మారెడ్డి,అల్లి శ్రీనివాస్ రెడ్డి,పోలేపక గణేష్,ఎండి ఇమామ్ సాబ్,తాడూరి వీరన్న,అల్వాల యాకమ్మ,బాణాల శైలజ తదితరులు పాల్గొన్నారు.


