ప్రపంచ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా రైతంగానికి శుభాకాంక్షలు.
పేద రైతు కష్టానికి ఘన గౌరవం.
బచ్చలకూరి రాములు ను సన్మానించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మందడి ఇజ్రాయిల్.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 1 ( నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండల కేంద్రం లో ప్రపంచ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా తిరుమలాయపాలెం మండల కేంద్రం కు చెందిన నిరుపేద రైతు బచ్చలకూరి రాములు ను ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ ఘనంగా సన్మానించారు. చిన్న వయసు నుంచే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ బీద కుటుంబంలో జన్మించిన రాములు, వ్యవసాయాన్నే నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తూ గ్రామంలో కష్టపడే రైతుగా మంచి గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు. సంపద కంటే శ్రమ గొప్పదని, రైతు కష్టం వల్లే సమాజం నిలబడుతుందని మందడి ఇజ్రాయిల్ పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రాములు వంటి రైతులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. రైతుల శ్రమకు తగిన గౌరవం, గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని, కష్టపడే రైతులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా బచ్చలకూరి రాములు మాట్లాడుతూ, తనలాంటి సాధారణ రైతును గుర్తించి సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. నిజాయితీగా శ్రమిస్తే తప్పకుండా గుర్తింపు వస్తుందని యువతకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొని రాములను అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మాజీ సర్పంచ్ మందడి ఇజ్రాయిల్ మాజీ సర్పంచ్ మందుల వెంకన్న వల్లోజు వెంకటేశ్వర్లు వల్లపు కోటయ్య ఏలూరి సత్యనారాయణ మందుల ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.

