నమస్తే న్యూస్ మహబూబాబాద్
నేడే కందగిరిజాతర..
మరో యాదాద్రిలా అభివృద్ధి చేయాలనీ కోరుతున్న భక్తులు
ప్రతి ఏడాది హామీలకే పరిమితం అవుతున్న పాలకులు
దర్శనార్థం వేలాదిగా తరలి వస్తున్న భక్తులు కనీస వసతులు లేక ఇక్కట్లు
రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చే ఈ జాతరకు ఘాట్ రోడ్, రోప్ వే, గుడి నిర్మాణానికి నిధులు కేటాయించాలని భక్తుల విజ్ఞప్తి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులో ఉన్న కందగిరి గుట్ట వద్ద కార్తీకపౌర్ణమి వేళ ఈ రోజు కందికొండ జాతర ఘనంగా జరుగనున్నది...
కందగిరి శిఖరాగ్రం పై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామిని, గుట్ట పైకి ఎక్కుతున్న క్రమంలో మార్గమధ్యంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారిన దర్శించుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు రేపు తెల్లవారు జామునుంచే తరలి రానున్నారు...

