అయ్యప్ప దీక్షలో లంచం
ఏసీబీకి పట్టుబడ్డ జీపీఓ
(నమస్తే న్యూస్, అక్టోబర్ 28, ఖమ్మం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ జీపీఓ బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.2 ఎకరాలు 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60 వేల లంచం డిమాండ్ చేసిన ఆయన, ఇప్పటికే రూ.40 వేలు స్వీకరించాడు. మిగిలిన రూ.20 వేల్లో రూ.5 వేలు తగ్గించి రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ చేశారు.ప్రస్తుతం శ్రీనివాస్ రావు అయ్యప్ప దీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయ్యప్ప మాల ధరించి అవినీతి చేస్తే ఎలా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

