బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంఎమ్మెల్యే మురళీ నాయక్
(నమస్తే న్యూస్, అక్టోబర్ 17, మహబూబాబాద్:)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ ఐకమత్యాన్ని మళ్లీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే రాష్ట్ర బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళీనాయక్ తెలిపారు.భూక్య మురళీనాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ— “బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేపు అక్టోబర్ 18న జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌లో మహబూబాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.ఇక నియోజకవర్గంలోని మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, ఇనుగుర్తి, నెల్లూకుదురు మండల కేంద్రాల్లో బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, టౌన్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎస్సీ-ఎస్టీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్ శ్రేణులు, మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ సత్సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం దీని అమలులో కట్టుబడి ఉందని డా. మురళీనాయక్ స్పష్టం చేశారు.

