Type Here to Get Search Results !

డ్రగ్స్ (మత్తు పదార్థాల) రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.

  • డ్రగ్స్ (మత్తు పదార్థాల) రహిత  సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
  • విద్యాసంస్థలు, రైల్వే,బస్ స్టేషన్లు, వివిధ రకాల ప్రజలు సంచరించే ప్రదేశాలలో విస్తృత ప్రచారం కల్పించాలి.
  • జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్.

(నమస్తే న్యూస్, అక్టోబర్ 13,మహబూబాబాద్) జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ డివిజన్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి, డి.ఎస్.పి,  ఎక్సైజ్, అన్ని విద్యాసంస్థల హెచ్ ఓ డి లు, వైద్య ఆరోగ్యశాఖ, తదితర సంబంధిత విభాగాలతో కలిసి డ్రగ్స్ నిర్మూలన పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు వారికి ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, అంగన్వాడీ కేంద్రాలు, తదితర సంక్షేమ వసతి గృహాలలో ప్రార్ధనా సమయాలలో డ్రగ్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించాలని,జిల్లా లోని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు, చికెన్ సెంటర్లు, రెస్టారెంట్లు, పై ప్రత్యేక నిఘా పెట్టి నిత్యం గమనిస్తూ ఉండాలని, సూచించారు. మున్సిపల్ పరిధి, గ్రామపంచాయతీ పరిధిలలో గుడుంబా తయారీ, రవాణా, వినియోగం పై నిఘా పెంచి, చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం పై జరిగే దుష్ పరిణామాలపై ప్రజల ప్రచారం కల్పించాలని సూచించారు.జిల్లాలో ఇప్పటివరకు గుడుంబా, డ్రగ్స్, ఎన్డిపిఎల్ తదితర పదార్థాలను రవాణా సరఫరా చేసిన వారిని గుర్తించి (1430) కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.అన్ని విభాగాల సమన్వయంతో జిల్లాలో డ్రగ్స్, గుడుంబా, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, డిఈఓ దక్షిణామూర్తి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్ లకావత్, జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాసరావు, దేశీ రామ్, శ్రీనివాస్, ఆర్ సి ఓ లు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమారాణి, ఎక్సైజ్ అధికారి అశోక్ కుమార్, , కలెక్టరేట్ పర్యవేక్షకులు రాఘవరెడ్డి, సంబంధిత అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.