బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మద్దతు
(నమస్తే న్యూస్,దంతాలపల్లి,అక్టోబర్ 16)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యకారచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దంతాలపల్లి సబ్ డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యాకన్న ఈ విషయాన్ని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9ను హైకోర్టు కొట్టివేయడం బాధాకరమని అన్నారు. దీనిపై బీసీ జేఏసీ ఈ నెల 18న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ న్యాయబద్ధమైన డిమాండ్‌కు మద్దతు తెలపాలని ఆయన కోరారు.శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని కేంద్రం, గవర్నర్ లు పట్టించుకోకపోవడం విచారకరమని యాకన్న విమర్శించారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చి బీసీల హక్కులను రక్షించాలని కేంద్రాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఉడుగుల పెద్దలింగన్న, లింగన్న, నక్క యాకన్న, గద్దల లింగన్న, సంపత్, వల్లపు సాయిలు, జక్కుల యాకసాయిలు, దొనకల్ ఎల్లయ్య, ఎస్కే సాజన్, దొనకల్ ఉపేంద్ర, యాసారపు యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.
x

