- గ్రానైట్ లారీ బోల్తా....త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
- ఓవర్ లోడ్ తో ధ్వంసం అవుతున్న ప్రధాన రహదారులు.
- అధికారుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రజలు.
- ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్.
(నమస్తే న్యూస్ బ్యూరో, అక్టోబర్ 21, తొర్రూరు)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక బస్టాండ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో గ్రానైట్ రాళ్లు తీసుకెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అకస్మాత్తుగా బోల్తా పడిన లారీ రోడ్డుమీద అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగుతోంది. భారీ రాళ్లు రోడ్డుమీద చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కాగా గ్రానైట్ లారీల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ,వాటి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
