నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకి రాకూడదు,
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్.
వాతావరణ సూచన ల మేరకు జిల్లాలో ఈరోజు భారీ వర్షం సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, క్షేత్రస్థాయిలో* *అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, సూచించారు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని,
పట్టణాలు, గ్రామాలలో వర్ష సూచనలపై అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు విస్తృత ప్రచారం (టామ్ టామ్) సోషల్ మీడియా, స్థానిక వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించి అప్రమత్తత చేయాలన్నారు,
ఎలాంటి పశు సంపద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, లేకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అన్నారు,
అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు,
అవసరమున్న చోట విపత్తుల నివారణ సిబ్బంది, రెవెన్యూ ,పోలీస్, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది యొక్క సేవలు వినియోగించుకోవాలి,
జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులతో ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు,

