ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు మృతి.
ప్రేమలమ్మ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది - పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి.
బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించిన ఝాన్సీ రెడ్డి.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే ద్వారా ఎక్స్ గ్రేషియా ఇప్పిస్తానని బాధిత కుటుంబానికి హామీ.
(నమస్తే మానుకోట-తొర్రూరు)
తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన అనుమాండ్ల ప్రేమలమ్మ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో వారు పండించిన వడ్లు ఎండపోసి, పనిచేస్తూ ఉండగా ఎండ దెబ్బ తాకి, తాను అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి తెలుసుకొని తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అదేవిధంగా తక్షణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీంతోపాటు వెంటనే సంబంధిత రెవెన్యూ మరియు పోలీస్ అధికారులతో మాట్లాడడంతో పాటు మహబూబాద్ డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి పోస్టుమార్టం వెంటనే చేపించి పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తి పట్ల సంఘీభావం తెలుపుతూ తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే ద్వారా సంబంధిత మంత్రుల ద్వారా చర్చించి వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి తో పాటు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తొర్రూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రామచంద్రయ్య గారు,చర్లపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి , కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కందాడి అశోక్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు హనుమాన్ల దేవేందర్ రెడ్డి గారు, గంజి ప్రసాద్ రెడ్డి గార్లతోపాటు వివిధ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

