Type Here to Get Search Results !

కొబ్బరి కాయల ప్రయోగాలొద్దు...శాస్త్రీయ పద్ధతిలో బోర్ లను వేద్దాం!

-బోర్ వెల్ పాయింట్ కోసం రైతులు కొబ్బరికాయ పద్ధతులు అనుసరించకూడదు.
-భూగర్భ జల శాఖను సంప్రదిస్తే బోర్ వెల్ పాయింట్ కోసం శాస్త్రీయంగా సర్వే చేసి బోర్ పాయింట్ నిర్ణయిస్తాం.
-జిల్లా భూగర్భజలశాఖ అధికారి వేముల సురేష్  

(నమస్తే మానుకోట-మహబూబాబాద్)

బోర్ వెల్ పాయింట్ కోసం రైతులు కొబ్బరికాయ పద్ధతులు అనుసరించకూడదని, రైతులు భూగర్భ జల శాఖను సంప్రదిస్తే బోర్ వెల్ పాయింట్ కోసం శాస్త్రీయంగా సర్వే చేసి  ఇవ్వడం జరుగుతుందని జిల్లా భూగర్భజలశాఖ అధికారి వేముల సురేష్  అన్నారు.భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో శనివారం కురవి మండల కేంద్రం లోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి హాజరై  మాట్లాడుతూ నీటి వృధాను అరికట్టాలని, ఇంకుడు గుంతల నిర్మాణం విరివిగా చేపట్టాలని, తద్వారా భూగర్భ జలాల సంరక్షణకు వీలవుతుందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి  సారించాలని తెలిపారు. 

జిల్లా భూగర్భజలశాఖ అధికారి వేముల సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ రంగం భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెంపొందించేందుకు రైతులు పొలాల్లో వర్షపు నీరును ఒడిసి పట్టడానికి, నీటి కుంటల నిర్మాణాలను చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రధానంగా భూగర్భజలాల అదనపు వినియోగం మరియు వృధాను నియంత్రించడానికి, ఆరుతడి పంటలను ఎంచుకొని బిందు సేద్యం పద్ధతులను పాటించాలని తెలిపారు.  బోర్ వెల్ పాయింట్ కోసం రైతులు కొబ్బరికాయ పద్ధతులు అనుసరించకూడదని, రైతులు భూగర్భ జల శాఖను సంప్రదిస్తే బోర్ వెల్ పాయింట్ కోసం శాస్త్రీయంగా సర్వే చేసి  ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. అవగాహన కార్యక్రమాలతో  విద్యార్థుల ద్వారా  వారి తల్లితండ్రులకు, ఇతర రైతులకు, మహిళలకు భూగర్భజల సంరక్షణ పద్ధతులు, నీటి పొదుపు వివరాలను తెలియ చెప్పాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.భూగర్భజలాల ప్రాముఖ్యత, సవాళ్లు మరియు స్థిరమైన భూగర్భజల నిర్వహణ చర్యల గురించి విద్యార్థులకు వివరించారు.అనంతరం  కార్యక్రమంలో  పాల్గొన్న అధికారులు,  రైతులు, విద్యార్థులచే జిల్లా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి, వారికి బహుమతులను,‌ అతిధుల ద్వారా అందచేయడం జరిగింది.జిల్లాలో భూగర్భ జలాలను ఉత్తమంగా నిర్వహిస్తున్నటువంటి మరియు భూగర్భజలాల వినియోగ రుసుమును విధిగా చెల్లిస్తున్నటువంటి విద్యా హెర్బ్,  కంపెనీకి పరిశ్రమల విభాగంలో మైనింగ్ విభాగం గాయత్రి గ్రైనేట్స్, వ్యవసాయ శాఖ విభాగంలో భూక్య రవికుమార్, హార్టికల్చర్ విభాగం భాస్కర్, సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి సునీల్ రెడ్డి, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీరబాబు, సహాయ భూగర్భజల అధికారులు శ్రీనివాస్, స్నేహ, చేతన్, సహాయ వ్యవసాయ అధికారి మురళి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాధ్యాయులు, తదితరులు  పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.