ప్రతిష్టాత్మక సి.ఎస్.ఆర్ అవార్డు మరింత బాధ్యత ను పెంచింది-రఘు అరికపూడి.
(నమస్తే న్యూస్ -హైదరాబాద్ )
నిరుపేదలకు,దివ్యాంగులకు,అపన్న హస్తాన్నందించడానికి మరింత కృషి చేస్తానని ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ ఆరికపూడి రఘు అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదిక లో ఆదివారం నాడు జరిగిన South India's Largest CSR Summit లో గడచిన పది సంవత్సరాలు గా బిడియల్ విన్నర్స్ ఫౌండేషన్, హోప్4స్పందన , తెలంగాణ రాష్ట్ర ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఎందరో మానవతా మూర్తులు అందించిన సహాయ సహకారంతో, రెండు తెలుగు రాష్ట్రాలలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ ఆరికపూడి రఘు కి సి యస్ ఆర్ "Life Time Achievement " అవార్డుని తెలంగాణ అగ్రికల్చర్ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి చేతుల మీదుగా అందించారు.ఇటీవల రిపబ్లిక్ డే రోజున జరిగిన గవర్నర్స్ ఎట్ హోం కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా దివ్యాంగజన్ సంక్షేమం కోసం కృషి చేస్తున్న డాక్టర్ రఘు ఆరికపూడి కి గవర్నర్ ప్రతిభా పురస్కారం ని గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పౌల్ ల సమక్షంలో అందుకున్నారు.ప్రధానంగా రాష్ట్రంలోని కండర క్షీణత వ్రాధి గ్రస్తులకు, ప్రమాధ వశాత్తూ ప్రమాదాలకు గురి అయి దీర్ఘ కాలం గా మంచానికే పరిమితం అయిన వెన్నెముక బాధితులకు, అంధులకు, మానసిక వికలాంగులకు, దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించడం, ఫ్లోరైడ్ బాధితులకు, అనాధ విద్యార్థినీ విద్యార్థులకు, నిరుపేద రైతు కుటుంబాలకు సేవలందించడం, వివిధ పత్రికల్లో వచ్చే మానవీయ కథనాలకు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు సాయం అందించడమే లక్ష్యం గా ముందడుగు వేస్తున్నారు రఘు ఆరికపూడి.దక్షిణ భారతదేశంలో నే అత్యంత ప్రతిష్టాత్మకమైన సి యస్ ఆర్ అవార్డు కి డాక్టర్ రఘు ఆరికపూడి ని ఎంపిక చేయడం హర్షం దాయకం అని తెలంగాణ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ తెలియజేశారు.


