(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
ఓయూ జేఏసీ నాయకులు మాలోతు రవి కుమార్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ... రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు సంపూర్ణ మద్దతు తెలియజేసి, ఓటు వేసి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ST నియోజకవర్గాల కంటే భారీ మెజార్టీతో డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచందర్ నాయక్ ను గెలిపించారని గుర్తు చేశారు.గత పది సంవత్సరాలుగా BRS ప్రభుత్వం గిరిజనులను అన్యాయానికి గురిచేసిందని, తండాలకు రెవెన్యూ సదుపాయాలు కల్పించకుండా గిరిజనుల అభివృద్ధిని పక్కన పడేసిందని అలాంటి పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తమవంతుగా ఓడించి, కాంగ్రెస్ పార్టీకి గిరిజన బిడ్డలు పెద్ద మొత్తంలో ఓటు వేసి గెలిపించారని, జన విద్యావంతుడైన డా.జాటోత్ రామచందర్ నాయక్ ను మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాలోతు రవి కుమార్ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలను విజ్ఞప్తి చేశారు.

