◆ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపిన దళిత సంఘాలు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి ) సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ పై ఇచ్చిన తీర్పు హర్షణీయం అని ఎమర్పియస్,అంబెడ్కర్ సంఘము, ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రం లోని అంబెడ్కర్ కు పూలమాల వేసి,బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మిడతపల్లి వెంకన్న,దంతాలపల్లి అంబెడ్కర్ సంఘము మండల ప్రధానకార్యదర్శి మిడతపల్లి హరీష్,దర్శనాలు వెంకన్న మాట్లాడుతూ,గత ముప్పై సంవత్సరాలుగా మందా కృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలించిందని ఈ ఫలితానికి సుప్రీమ్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షానీయం అని అన్నారు, ఈ తీర్పుకు అసంబ్లీ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తామని చెప్పడం జరిగింది,కానీ ఆర్డెన్స్ ఇచ్చి వెంటనే అమలు చేయాలని కోరారు,ఈ తీర్పుకీ సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో వర్గీకరణ చేస్తానని వాగదానం చెసి నెరవేర్చుకున్నారని అన్నారు అని అన్నారు, ప్రజలు ఆయనకు కృతగజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోమాదిగ మరియు,అంబెడ్కర్,మాదిగ ఉపకులాల సంఘాలు మరియు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో,మాదిగ సంఘాల నాయకులు పంతం విజయేందర్, సోమారపు అంజయ్య,నెమ్మది వెంకన్న,జగన్, సురేందర్,మహేదర్, సాయి,మనోజ్,నరేష్,సోమారపు సైదులు తదితరులు పాల్గొన్నారు.

