నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, సి డబ్ల్యూ సి చైర్మన్ నాగవాణి తదితరులు హాజరయ్యారు,
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ
ప్రతి రంగంలో మహిళలు వారి యొక్క ప్రతిభ కనబరచాలని అందుకు ప్రభుత్వం రాజ్యాంగంలో అనేక సౌకర్యాలు కల్పించిందని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మహిళలకు అధిక ప్రాధాన్యత కలిగి ఉండడం సంతోషకరంగా ఉందని అన్నారు.
ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ
మహిళలు పనిచేసే ప్రతిచోట స్వేచ్ఛ, సమానత్వం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు వారి వారి యజమాన్యాలు కృషి చేయాలని అన్నారు. మహిళలను గౌరవించిన ప్రతి చోటు బాగుంటుందని ఆయన అన్నారు. మహిళలు లింగ విభేదాలు లేకుండా ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, వారికి వ్యక్తిగత స్వేచ్ఛ కల్పించాలన్నారు.
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మట్లాడుతూ
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, అత్యుత్తమ సర్వీసులలో ప్రతిభ కనబరచడం జరుగుతుందని గుర్తు చేశారు. మహిళలు మరింత శ్రమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన కోరారు
ఈ సందర్బంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలను కనబరిచిన మహిళలను గుర్తించి వారిని సన్మానించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, మున్సిపల్ చైర్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి ,సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి, జడ్పీ సీఈవో రమాదేవి, డిడబ్ల్యూఓ వరలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు




