సంతలో నెలకొనిఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం:ఎంపీఓ సోంలాల్
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించబోయే సంతకు కావలసిన ఏర్పాట్లను, పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఎంపీఓ సోంలాల్ అన్నారు. నర్సింహులపేట సంత హక్కుల కోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం వేలం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ మొత్తం 13మంది ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనగా ఖమ్మం కు చెందిన ఎస్.కె అజీమ్ రూ.15.77 లక్షలతో హక్కులను దక్కించుకున్నారన్నారు. నిబంధనలు అనుసరించి 1/3 వంతు సొమ్మును చెల్లించగా హక్కుదారునికి,హక్కు పత్రాన్ని అందించామని,ఎప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 8వ తేదీ వరకు సంతను నిర్వహించుకోవచ్చని ఎంపీఓ సోంలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు గన్న ఉపేందర్ రెడ్డి, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

