◆రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలి-జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులు ఏమీ లేవని, కుటుంబ అభివృద్ధికి ఆలోచించే బిఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రజల కోసం పనిచేసే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి సర్కార్ పంచాయతీలకు కేటాయించిన నిధులతోనే సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు బ్రతికి ఉన్నారని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని డోర్నకల్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా సంగీత రమేష్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలోని భాజపా పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు పయనిస్తుంటే..సీఎం కేసీఆర్ పాలనలోని తెలంగాణ రాష్ట్రం మాత్రం అప్పుల్లో కూరుకుని పోయిందని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికలలో గెలవడానికి మాత్రమే దళిత బంధు పథకాన్ని తెరమీదకి తీసుకొని వచ్చారని,ఆ పథకంలో సైతం ఎమ్మెల్యే లు 3లక్షల వరకు వసూలు చేశారని స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రావడం వారి అవినీతికి నిదర్శనమని అన్నారు. మారుమూల ఆదివాసి గూడానికి చెందిన దళిత మహిళను అత్యున్నత రాష్ట్రపతి గా నియమించిన ఘనత నరేంద్ర మోడీదేనని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా , బడుగు ,బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. అనంతరం సంగీత రమేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటు డోర్నకల్ నియోజకవర్గంలో కుటుంబ పాలన కొనసాగుతుందని కుటుంబాల అభివృద్ధి కోసం కాకుండా ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ, రాబోయే ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం లో కమలం గుర్తుకు ఓటు వేసి కాషాయ జెండాను ఎదురవేయాలని సంగీత రమేష్ నాయక్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామచందర్ రావు, అసెంబ్లీ ప్రభారీ దామోదర్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ కో కన్వీనర్ ధర్మారపు వెంకన్న, మండల అధ్యక్షులు బోయిని యాకన్న,బద్రీసేన గౌడ్, దేవా,వెంకటేష్,నగేష్,బింగి రమేష్, ప్రవీణ్,సుమన్, సాయి మురళి శేఖర్, రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



