శిక్షణా తరగతులకు విధులను కేటాయించిన అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.శనివారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెలాఖరులో నిర్వహించే ఎన్నికల శిక్షణా తరగతులకు విధులు కేటాయించిన అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.జిల్లా కేంద్రంలోని ఫాతిమా స్కూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లను విడతలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.శిక్షణ తరగతులకు హాజరయ్యే అధికారులకు తగు సమాచారం పంపేలా బల్క్ మెసేజ్ ప్రక్రియను వినియోగించుకోవాలని ఈ డిస్టిక్ మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు . సమావేశంలో జెడ్పి డిప్యూటీ సీఈఓ నర్మద సిపిఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ విజయలక్ష్మి గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల శిక్షణా తరగతులకు అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలి-జిల్లా కలెక్టర్ శశాంక.
October 28, 2023
0