◆రైల్వే జీఎం ని కలిసిన మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్.
(నమస్తే మానుకోట-హైదరాబాద్)
మహబూబాబాద్ నియోజకవర్గం లోని పలు రైల్వే స్టేషన్లో గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లు ఆగకుండా వెళ్తున్నందున తిరిగి వాటిని మరలా కేసముద్రంలో ఆగే విదంగా చర్యలు తీసుకోవాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ కోరారు. ఈ సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే జిఎం కార్యాలయంలో జీఎం ను మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా జీఎంతో మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గం లోని మహబూబాబాద్,కేసముద్రం రైల్వే స్టేషన్లో గతంలో ఆగుతూ వస్తున్న రైళ్లు ఆగకుండా వెళ్తున్నందున తిరిగి వాటిని మరలా పునరుద్దరించాలని తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.కేసముద్రంలో సింగరేణి, పుష్పల్, నాగపూర్, మచిలీపట్నం, మణుగూర్, కొల్లాపూర్, పద్మావతి (అప్), సాయినగర్ షిర్డి తదితర రైళ్ళను రద్దు చేయబడినందున వాటిని తిరిగి మరలా పునరుద్ధించాలని కోరారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజల సౌలభ్యం కోసం హైదరాబాద్ ప్రయాణం కు 12740-12749 గరిబ్ రథ్ అప్&డౌన్, ఢిల్లీ వెళ్ళడం కోసం 20805-20806 ఏపి ఎక్స్ ప్రెస్
