ఐటీడీఏ ద్వారా మంజూరైన పంతులు తండా నుండి మునిగలవీడు గ్రామానికి తారు రోడ్డు పనులను ఈరోజు తండా వాసులతో కలిసి గ్రామ సర్పంచ్ నల్లాని నవీన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పంతులు తండావాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి స్థానిక ఎంపీ మరియు ఎమ్మెల్యేల సహకారంతో ఐటీడీఏ నిధులనుండి రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల వ్యయంతో తారు రోడ్డును మంజూరు చేపించి తండావాసుల మరియు గ్రామస్తుల దశాబ్దాల కొరికను నెరవేర్చడం జరిగిందనీ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల సరైన రహదారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న తండా వాసులకు మరియు పరిసర గ్రామ వ్యవసాయదారులకు ఈ రోడ్డు మార్గం ఎంతో ఉపయోగకరమన్నారు.... పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ రోడ్డు మంజూరు కోసం కృషిచేసిన సర్పంచ్ నవీన్ రావును అభినందిస్తూ దీనివల్ల మాకు కష్టాలు తొలుగుతాయని తండావాసులు వర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బారాస జిల్లా యూత్ నాయకులు నల్లాని ప్రవీణ్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు సూర్యప్రకాష్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ప్రభాకర్ గౌడ్, గ్రామ కో ఆప్షన్ నెంబర్ కోమ్మనబోయిన ముఖేష్, తండా పెద్దమనిషి భూక్యా బంగ్యా నాయక్, చెక్రు, రమేష్, బోల్లేపెల్లి లింగయ్య, సందు యాకన్న తదితరులు పాల్గొన్నారు...
నెరవేరిన దశాబ్దాల కల.. హర్షం వ్యక్తం చేసిన పంతులు తండా వాసులు.... రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించిన సర్పంచ్ నల్లాని నవీన్ రావు...
August 18, 2023
0
Tags
